గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (22:52 IST)

జ్యోతిక‌, న‌య‌న‌తార‌కు లైఫ్ ఇచ్చిన స‌దా! (video)

jyotika, nayanatara and sada
జీవితంలో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలీదు. బ‌ళ్ళు ఓడ‌లు, ఓడ‌లు బ‌ళ్ళు అవుతాయంటారు. సినిమారంగంలో ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈరోజు సాధార‌ణ న‌టుడు, రేపు క‌ల‌సివ‌స్తే టాప్ స్టార్ అయిపోతాడు. అది ఫేట్ అనండి. జాత‌కం అనండి. ఏదైనా కానీయండి.

సినిమారంగంలో రాణించాలంటే అదృష్టం వుండాల‌నేది నానుడి. అలాంటి అదృష్ట‌మే న‌టి స‌దాకు తొలిరోజుల్లో వచ్చింది. న‌టిగా మారాల‌ని ఇంట‌ర్‌ వ‌ర‌కు చ‌దివిన ఆమె ముంబైలోని యాక్టింగ్ స్కూల్‌కు వెళ్ళింది. అక్క‌డ తీసిన ఫొటో అనుకోకుండా ద‌ర్శ‌కుడు తేజ‌కు చేర‌డం `జ‌యం`లో ఆమె న‌టికావ‌డం. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమా `అప‌రిచితుడు`లో న‌టించ‌డం జ‌రిగిపోయాయి. అయితే అక్క‌డే ఆమెకు చిన్న బ్రేక్ ప‌డింది.
 
అప‌రిచితుడు సినిమా చేస్తుండ‌గానే ఆమెకు ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న `చంద్ర‌ముఖి`లో ఆఫ‌ర్ వ‌చ్చింది. ముందుగా జ్యోతిక పాత్ర‌ను ఆమెను అడిగారు. అయితే శంక‌ర్ `అప‌రిచితుడు` ఇంకా పూర్తికాలేదు. డేట్స్ కుద‌ర‌క వ‌దులుకుంది. అనుకోకుండా చంద్ర‌ముఖి కాస్త ఆల‌స్య‌మైంది. మ‌ర‌లా స‌దాకు చంద్ర‌ముఖిలో ఆఫ‌ర్ వ‌చ్చింది.

ఈసారి న‌య‌న‌తార చేసిన పాత్ర‌ను ఆమెను ఫిక్స్ చేశాడు ద‌ర్శ‌కుడు. అయితే ఇంకా అప‌రిచితుడు క్ల‌యిమాక్స్ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల వాయిదాప‌డుతూ స‌దాకు చంద్ర‌ముఖిలోని న‌య‌న‌తార పాత్ర‌కూ బ్రేక్ ప‌డేలా చేసింది. ర‌జ‌నీసార్ సినిమా వ‌దులుకోవ‌డం ఇష్టంలేక రెండుసార్లు వ‌చ్చిన ఆఫ‌ర్ క‌నుక శంక‌ర్‌కు రిక్వెస్ట్ చేసింది. ఆయ‌న వ‌ద్ద‌నలేదు. కాకాపోతే అప్ప‌టికే అంద‌రి డేట్స్ సెట్ అయ్యాయి. అపరిచితుడు పోస్ట్‌పోన్ చేయ‌డానికి సాధ్య‌ప‌డ‌దు. బ‌ల‌వంతంగా వ‌దుకోవాల్సివ‌చ్చింది. ఇటీవ‌లే ఈ విష‌యాన్ని ఇంట‌ర్యూలో వెల్ల‌డించింది.
 
సో. ఇదంతా త‌ల‌చుకుంటుంటే న‌టి స‌దాకు ఆశ్చ‌ర్యంతో పాటు కాస్త ఆవేద‌న కూడా క‌లిగింది. ఏదిఏమైనా డెస్టినీ ఎలా వుంటుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. కేవ‌లం స‌దా డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో న‌య‌న‌తార అనే ఆర్టిస్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్పుడు న‌య‌న‌తార ఏ స్థాయిలో వుందో తెలిసిందే. బ‌ట్ స‌దా ఇంకా న‌టిగా స్ట్ర‌గుల్ ప‌డుతూనే వుంది.