శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (15:32 IST)

కాంగ్రెస్‌కు యువనేత గుడ్ బై : కాషాయం కండువా కప్పుకున్న జితిన్

కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలిగింది. ఆ పార్టీకి చెందిన యువ నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన పేరు జితిన్ ప్రసాద. ఈయన బుధవారం బీజేపీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. 
 
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనం రేకెత్తించింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద్ గత ఏడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు. 
 
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్. 2001లో యూత్ కాంగ్రెస్‌లో చేరిన జితిన్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేశారు. 
 
యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్‌లో యువ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని, బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద బీజేపీలో చేరాక విలేకరులతో అన్నారు.