బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (15:43 IST)

తిరుమలలో నటి శ్రీదేవి ఏం చేసింది..?

అలనాటి సినీనటి శ్రీదేవి. ఈమె సినిమాలంటే అభిమానులు పడి చచ్చిపోతుంటారు. శ్రీదేవి సినిమా అంటే మొదటిరోజు మొదటిఆట కోసం అభిమానులు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి శ్రీదేవి పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైంది.

అలనాటి సినీనటి శ్రీదేవి. ఈమె సినిమాలంటే అభిమానులు పడి చచ్చిపోతుంటారు. శ్రీదేవి సినిమా అంటే మొదటిరోజు మొదటిఆట కోసం అభిమానులు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి శ్రీదేవి పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైంది. కానీ ఆమె గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు తళుక్కున ఫంక్షన్లకు వస్తూ వెళుతుంటారు. శ్రీదేవి భక్తి కూడా ఎక్కువే. తిరుమల వెంకన్న అంటే మరీ భక్తి.
 
అందుకే సంవత్సరానికి ఒకసారైనా స్వామివారిని దర్శనం చేసుకొని వెళుతుంటారు. ఈరోజు తెల్లవారుజామున శ్రీవారిని సుప్రభాతసేవలో దర్శించుకున్నారు శ్రీదేవి. భర్త బోనికపూర్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీదేవిని చూసేందుకు అభిమానులు క్యూలో ఎగబడ్డారు. ఆమెకు కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. అందరిని చూస్తూ వినమ్రంగా రెండు చేతులతో శ్రీదేవి నమస్కరిస్తూ స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోయారు.