సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (15:16 IST)

కమల్‌కు తోడు దొరికిన గోపాలకృష్ణుడు.. బాహుబలి పాతాళ భైరవికి కాపీ అట..?

బాహుబలి సినిమాపై సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి ఓ సాంకేతిక ట్విస్ట్.. అంతా టెక్నాలజీతో తీసిన సినిమా అంటూ తీసిపారేశారు. బాహుబలి కథకు అర్థం పర్థం ఉందా అంటూ న

బాహుబలి సినిమాపై సినీ లెజెండ్ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి ఓ సాంకేతిక ట్విస్ట్.. అంతా టెక్నాలజీతో తీసిన సినిమా అంటూ తీసిపారేశారు. బాహుబలి కథకు అర్థం పర్థం ఉందా అంటూ నవ్వేశాడు. తనకు బాహుబలిలో నటించే అవకాశంపై కమల్ ఘాటుగా స్పందించాడు. తానేమైనా గొర్రెనా.. తనకూ బుద్ధి, జ్ఞానం ఉన్నాయంటూ ఇటీవల కామెంట్లు చేశారు. తాజాగా కమల్‌కు తోడు దొరికారు. 
 
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలికి ప్రపంచ సినీ ప్రేక్షకులు జేజేలు పలుకుతుంటే.. కొందరు మాత్రం ఆ సినిమా విజయాన్ని తేలిగ్గా తీసిపారేస్తున్నారు. తాజాగా ప్రముఖ కథా రచయిత, సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్(75) ‘బాహుబ‌లి-2’ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇలాంటి సినిమాలు చూసేందుకు తాను పది రూపాయలు కూడా ఖర్చుచేయనన్నాడు. 
 
బాహుబలి ద్వారా భారత సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేదన్నారు. రూ.10కోట్లతో మనం పది సినిమాలు నిర్మించవచ్చునని.. అలాంటిది వందకోట్ల బడ్జెట్‌తో ఇలాంటి ఉపయోగం లేని సినిమాలు తీయడం అవసరమా అన్నారు. 1951లో వచ్చిన పాతాళ భైరవికి బాహుబలి కాపీ అని గోపాలకృష్ణన్ అన్నారు. అంతేగాకుండా.. ఇలాంటి సినిమాల ద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుందని గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు.