సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జులై 2024 (18:11 IST)

రేవు పాటలు విన్నాక కొత్తతరంపై నమ్మకం ఏర్పడుతోంది : రామజోగయ్య శాస్త్రి

Ramajogaiah Sastri, Chandra Bose, Suddala Ashok Teja, Ananth Sriram, Kasarla Shyam
Ramajogaiah Sastri, Chandra Bose, Suddala Ashok Teja, Ananth Sriram, Kasarla Shyam
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది.

గీత రచయితలు  చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అతిథులుగా ఈ రోజు హైదరాబాద్ లో రేవు సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
 
గీత రచయిత చంద్రబోస్ మాట్లడుతూ, అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి గారిని కలుసుకోవడం సంతోషంగా ఉంది. రేవు సినిమాకు పాటలు రాసిన ఇమ్రాన్ శాస్త్రి పేరు ఎంత వైవిధ్యంగా ఉందో అతను రాసిన పాటలు అంతే వైవిధ్యంగా ఉన్నాయి. అన్నిఎమోషన్స్ తో పాటలు రాశారు. సంగీతం బాగుంది. రేవు సినిమాలో నవ్యత, నాణ్యత రెండూ కనిపించాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - రేవు పాటల విన్నాక ఒక ఉద్విగ్నతకు లోనయ్యాను. అంత బాగున్నాయి. మనం కంటెంట్ ఉన్న వైవిధ్యమైన సినిమాలు కావాలంటే పర భాషల వైపు చూస్తుంటాం. కానీ రేవు సినిమా పాటలు విన్నాక కొత్తతరం ప్రతిభావంతులపై నమ్మకం ఏర్పడుతోంది. రేపటి తెలుగు సినిమా బాగుంటుందని అనిపిస్తోంది. ఇది మా దమ్ము అంటూ పాటల్ని చూపించి  ఇది అనిపించుకున్నారు రేవు టీమ్. లిరిసిస్ట్ ఇమ్రాన్, మ్యూజిక్ చేసిన జాన్ కు కంగ్రాట్స్. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే దర్శకుడు హరినాథ్ కు శుభాకాంక్షలు. తెలుగు సంగీత దర్శకులకు అవకాశాలు రావాలి అప్పుడే మనవారి ప్రతిభ తెలుస్తుంది అన్నారు.
 
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ -  రేవు సినిమా వేదిక మీద అక్షరాలన్నీ కలిపినట్లు ఉంది. ఈ క్యాసెట్ ను నేను దాచుకుంటా. అప్పట్లో రాఘవేంద్రరావు, దాసరి గారి సినిమాలకు పనిచేసి ఆ క్యాసెట్ అందుకున్నప్పుడు కలిగిన సంతోషం ఇప్పుడు కలుగుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. మనమంతా రేవు సినిమాకు సపోర్ట్ చేయాలి. ఇది స్ఫూర్తిగా కొత్త ప్రతిభావంతులు సినిమాలు చేసేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాణ పర్యవేక్షకులు ప్రభు మాట్లాడుతూ - రేవు సినిమా పెద్ద కమర్షియల్ హంగులు ఉన్న మూవీ కాదు. ఇదొక జీవన పోరాటం. మత్య్సకారుల జీవితాలను తెరపై చూపిస్తుంది. అందరి సపోర్ట్ రేవు సినిమాకు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ - రేవు మూవీ మంచి సక్సెస్ కావాలని, ఈ బ్యానర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.
 
దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ - రేవు సినిమాను మత్స్య కారుల జీవితాలను ప్రతిబింబించేలా రూపొందించాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు.