త్రినాధరావు నక్కిన దర్శకత్యంలో ఐరా క్రియేషన్స్ కొత్త చిత్రం
Trinadha Rao Nakkina, Usha Mulpuri, Shankar Prasad
రవితేజతో ధమాకా చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్. ఆయన గత చిత్రం ధమాకా 2022లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. తాజాగా నాగశౌర్య సొంత బేనర్లో సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించి చెక్ ను నిర్మాతలు అందజేశారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌తో త్రినాథరావు నక్కిన చేతులు కలిపారు. త్రినాధరావు నక్కిన , ప్రొడక్షన్ బ్యానర్‌కి ఇది నెక్స్ట్ ప్రాజెక్ట్. భారీ బడ్జెట్‌తో ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 5 దర్శక, నిర్మాతలకు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది.
ఈరోజు ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. హీరో, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.