బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (16:54 IST)

ధమాకాలో నిరుద్యోగి, మల్టీ మిలియనీర్ గా రవితేజ

Ravi Teja, Srileela
Ravi Teja, Srileela
మాస్ మహారాజా రవితేజ,  ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ధమాకా'తో డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. అత్యున్నత ప్రమాణాలు, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన టిజి విశ్వ ప్రసాద్ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్‌ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.
 
స్వామి (రవితేజ) నిరుద్యోగి. స్లమ్ లో నివసించే స్వామికి నెలకు కనీసం ఒక ఉద్యోగం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మరోవైపు ఆనంద్ చక్రవర్తి (మరో రవితేజ) ఒక మల్టీ మిలియనీర్. అతను ఒక నెలలో 1000 మందికి ఉపాధిని ఇవ్వగలడు. మరోవైపు పావని (శ్రీలీల) వారిద్దరితో ప్రేమలో ఉంటుంది. స్వామి, ఆనంద్‌లు దారులు వేరు. కానీ విధి వారిని ఒక కామన్ శత్రువుతో పోరాడటానికి ఒకచోట చేరుస్తుంది.
 
కథాంశం కమాండింగ్ గా వుంది. స్క్రీన్‌ప్లే రెసీ, ఎంటర్ టైనింగా వుంది. రవితేజ ఆనంద్‌గా క్లాస్‌గా కనిపించి స్వామిగా మాస్‌గా కనిపించారు. రెండు పాత్రలలోనూ ఒదిగిపోయినప్పటికీ మాస్ క్యారెక్టర్‌ మరింత ఆకర్షణీయంగా వుంది. శ్రీలీల తన ఛార్మ్ నెస్ తో ఆకట్టుకుంది. శ్రీలీలా, రవితేజ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అలరిస్తోంది. త్రినాథరావు నక్కిన 'ధమాకా'ని  పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం ఫ్యాన్స్ కు థ్రిల్ చేస్తోంది.
 
భీమ్స్ సిసిరోలియో యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా జింతాక్ బీట్స్ ఎక్స్ట్రా కిక్ ని ఇచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం అద్భుతంగా వుంది.  ప్రతి ఫ్రేమ్ లైవ్లీగా కనిపిస్తుంది. పుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని లావిష్ గా  నిర్మించాయి. ట్రైలర్ అంతటా గ్రాండ్‌నెస్ ఉంది. ప్రసన్న కుమార్ బెజవాడ హిలేరియస్ రైటింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. త్రివిక్రమ్‌పై ఒక డైలాగ్ హిలేరియస్ గా వుంది. ఇది త్రివిక్రమ్ పై రచయితకు ఉన్న గౌరవాన్ని చూపుతుంది. మొత్తం మీద ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
 
ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించారు.
ఈ ట్రైలర్‌ తో భారీ అంచనాలు నెలకొల్పిన 'ధమాకా' డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.