శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (07:21 IST)

బాలయ్య దెబ్బకు తట్టుకోలేక పోయిన 'సౌండ్ సిస్టం'

యువరత్న బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం "అఖండ". బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సూపర్ హిట్ టాక్‌కు ప్రదర్శించబడుతూ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. ఇందులో బాలయ్య యాక్షన్‌కు బాలయ్య ఫ్యాన్స్ తెగ ఆనందంలో మునిగిపోతున్నారు. థియేటర్లలోని సౌండ్ సిస్టమ్స్ తట్టుకోలేక పోతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ సంఘటన ఒకటి శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. 
 
జిల్లా కేంద్రంలోని రవిశంకర్ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం అఖండ సినిమాను ప్రదర్శిస్తున్నారు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తెరవెనుక ఉన్న సౌండ్ సిస్టమ్స్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో థియేటర్‌లోని ప్రేక్షకులంతా ప్రాణభయటంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశాయి. ఈ షార్ట్ సర్క్యూట్‌పై బాలయ్య ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య దెబ్బకు సౌండ్ సిస్టమ్స్ తట్టుకోలేకపోతున్నాయి అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు.