1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (18:22 IST)

ఇంజిన్ ఫెయిల్ - షార్ట్ సర్క్యూట్ - అగ్నికి ఆహుతైన కారు

తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామా శివారులో 65వ జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. ఆ కారు ఇంజన్‌లో సాంకేతికలోపం ఉత్పన్నంకావడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ప్రమాదం జరిగింది. 
 
మహారాష్ట్ర నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా మధ్యలో కోహీర్ మండలం దిగ్వల్ గ్రామా సమీపంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారు దగ్ధమైంది. 
 
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.