తమిళంలో చెల్లెలు.. తెలుగులోకి అక్క ఎంట్రీ.. ఇంతకీ వీళ్లెవరు?
శ్రీదేవి తన నాలుగు సంవత్సరాల వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది, తమిళ చిత్రం "కందన్ కరుణై"తో అరంగేట్రం చేసింది. ఐదు దశాబ్దాలుగా, ఆమె బాలనటి నుండి ప్రముఖ నటిగా మారింది. చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇద్దరు కూతుళ్లు జాన్వి, ఖుషి తమ తల్లి అడుగుజాడల్లో నడిచారు.
పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ చిత్రం "ధడక్"తో కథానాయికగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో దేవర సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ కూడా బాలీవుడ్‌లో సినీ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ఆమె తొలి చిత్రం, "ది ఆర్చీస్" దీనిని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ విడుదల చేస్తోంది.
ఆమె మొదటి చిత్రం ఇంకా తెరపైకి రానప్పటికీ, కోలీవుడ్‌లోకి ఖుషీ కపూర్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆకాష్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో యువ హీరో అధర్వ సరసన ఖుషీ కపూర్ జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జాన్వీ తెలుగు సినిమాని ఎంచుకుంటే మరోవైపు కుషీ తమిళ సినిమాను ఎంచుకుంది.