మంగళవారం, 11 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : సోమవారం, 10 మార్చి 2025 (18:00 IST)

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

Al Amina Zaria Ruksana- Srikanth Odela
Al Amina Zaria Ruksana- Srikanth Odela
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ది ప్యారడైజ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.దసరాకు అనేక అవార్డులు అందుకున్న శ్రీకాంత్ ఓదెల,ది ప్యారడైజ్ చిత్రానికి సంబందించిన  రా స్టేట్‌మెంట్ తో ప్రశంసలు అందుకున్నారు.తన మూడవ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి గారికి  దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పుడుతన సొంత బ్యానర్ సమ్మక్క సారక్క క్రియేషన్స్‌ను ప్రారంభించడం ద్వారా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.
 
ఈ చిత్రాన్ని చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌కు చెందిన అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలను నిర్మాణ భాగస్వాములుగా చేస్తూ శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి కథను కూడా అందిస్తున్నారు, ఈ చిత్రానికి నూతన దర్శకుడు చేతన్ బండి రచన, దర్శకత్వం వహించనున్నారు.
 
పోస్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ "AI అమీనా జరియా రుక్సానా గులాబీ" అని ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నల్లటి చీరలో ఒక అమ్మాయి సరిహద్దు వెంట నడుస్తూ, ఎర్ర గులాబీలు చెల్లాచెదురుగా పడి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్ మరియు ఆకర్షణీయమైన పోస్టర్ కలయిక ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తుంది.
 
"AI అమీనా జరియా రుక్సానా గులాబీ" అనేది 2009లో గోదావరిఖని అనే బొగ్గు పట్టణం నేపథ్యంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఒక ప్రేమకథ. ఈ ప్రేమ గాథ ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించే అమ్మాయి యొక్క లోతైన భావోద్వేగాలను చిత్రీకరిస్తుంది.
 
ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మరియు త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో, చిత్ర నిర్మాతలు ఈ చిత్ర తారాగణం మరియు సాంకేతిక నిపుణులను కూడా వెల్లడిస్తారు.