బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (14:28 IST)

బెజవాడ దుర్గమ్మకు రూ.18 లక్షలతో మంగళసూత్రం.. సామాన్య భక్తుడి కానుక (video)

Mangalasutram
Mangalasutram
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని బెజవాడ దుర్గమ్మకు భారీ కానుకలు వస్తున్నాయి. ఇప్పటికే వజ్రకిరీటంతో పాటు భారీ విలువ చేసే బంగారు ఆభరణాలను కానుకలుగా అందజేశారు ముగ్గురు భక్తులు. 
 
తాజాగా రూ.18 లక్షలతో మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చారు ఓ సామాన్య భక్తుడు. రూ.18 లక్షల విలువ చేసే 203 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను ప్రకాశం జిల్లా కొండేపి గ్రామానికి చెందిన కళ్లకుంట అంకులయ్య ,రాజేశ్వరి దంపతులు సమర్పించారు. 
 
వీరు కొబ్బరి బొండాలు కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన సంపాదనలో ప్రతీరోజు కొంత దాచి అమ్మవారికి మంగళ సూత్రాలను తయారు చేయించినట్లు ఆ దంపతులు మీడియాతో తెలిపారు.