లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ ముక్క.. ఏంటిది గోవిందా?!
ఖమ్మం జిల్లా గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మావతి అనే భక్తురాలు తిరుమల నుంచి తాను తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ ముక్క, పొగాకు ఆనవాళ్లు ఉన్నాయని ఆరోపించింది. ఖమ్మం రూరల్ మండలంలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉండే పద్మావతి మాట్లాడుతూ.. తాను సెప్టెంబర్ 19న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చినట్లు తెలిపారు.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె తన బంధువులు, ఇరుగుపొరుగు వారికి పంచడానికి లడ్డూను ముక్కలుగా చేసి, ప్రసాదం లోపల గుట్కా పాకెట్ ముక్క, పొగాకు ముక్కలు వున్నట్లు గుర్తించినట్లు ఆరోపించింది.
ఇప్పటికే లడ్డూ ప్రసాదంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. గుట్కా ముక్క లడ్డూ ప్రసాదంలో వుండటం కొత్త వివాదానికి దారి తీస్తుంది. ఇప్పటికే తిరుమల లడ్డూలో పందికొవ్వు, జంతువు కొవ్వు కలిసిన నెయ్యి వినియోగించారని రిపోర్టులలో తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.