ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (09:24 IST)

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు.. స్పందించిన నటి ప్రణీత

pranitha
శ్రీవారి భక్తులు పరమపవిత్ర ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలిపి తయారు చేశారంటూ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేబోరేటరీ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. దీనిపై శ్రీవారి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదే అంశంపే సినీ నటి ప్రణీత స్పందించారు. 
 
'శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇది శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కలలో కూడా ఊహించనిది' అని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ఈ వివాదంపై మొదటిగా స్పందించినందుకు ఆమెను అభినందిస్తున్నారు.
 
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తిరుమల, తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో పెద్దఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు బదులు ఇతరత్రా కొవ్వులు (ఫారిన్ ఫ్యాట్స్) కలగలిసి ఉన్నట్లు గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీబీ) కాఫ్ లిమిటెడ్ సంస్థ అనుమానం వ్యక్తంచేసింది. లడ్డూ తయారీలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలసి ఉండొచ్చని పేర్కొంది.