శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 19 సెప్టెంబరు 2024 (22:02 IST)

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

yv subbareddy
పవిత్రమైన శ్రీవారు ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిపారని నివేదకలో తేలడంతో ఇపుడు ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన వ్యవహారం కావడంతో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత లోతుగా పరిశీలించి, కారకులను వెతికిపట్టుకునే పనిలో వున్నట్లు తెలిపారు. స్వామివారి లడ్డూలో జంతు కొవ్వును వాడటానికి కారకులెవరో తేల్చే పనిలో వున్నామనీ, వాస్తవం తెలిసిన తర్వాత వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తిరుమల ప్రతిష్టను భ్రష్టుపట్టించారనీ, స్వామివారి ప్రసాదాల దగ్గర్నుంచి సామాన్య భక్తుల సౌకర్యాలు, స్వామి వారి దర్శనాలకు సంబంధించినవన్నీ భక్తులకు అసౌకర్యాలను కలిగించేవిగా చేసారని మండిపడ్డారు.
 
మరోవైపు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తయారు చేయించామని తితిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ విషయమై తాను ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానని చెప్పారు. తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్పారు. వైవీ వ్యాఖ్యలపై తెదేపా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ... తిరుమల ప్రసాదం మీద ప్రమాదం చేసేందుకు వైవి సుబ్బారావు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.
 
లడ్డూ ప్రసాదం అవకతవకలపై విచారణ కోరే దమ్ము మీకున్నదా అని ప్రశ్నించారు. జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సీబీఐ విచారణ కోరి, ఆ తర్వాత తోక ముడవడానికి కారణం ఏంటని నిలదీశారు. ప్రత్యేక హోదాపై సభలో సమ్మతించి గద్దెనెక్కాక మాటతప్పి ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ తాను చెప్పేవాటికి చేసే పనులకు పొంతన వుండదని అన్నారు.