బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (20:01 IST)

"థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయన్సర్ ఛాలెంజ్".. సృజనాత్మకతకు సవాలు

Thrill City Influencers Challenge Curtain Raiser
Thrill City Influencers Challenge Curtain Raiser
టాలెంట్ ఎవరి సొత్తూ కాదు..
అవకాశం వదలొద్దు.. 
సోషల్ మీడియా మీ హద్దు..
 
థ్రిల్ సిటీ సోషల్ మీడియా 
ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్ 
కర్టెన్ రైజర్ ఈవెంట్'లో 
మాస్ కా దాస్ విశ్వక్సేన్
 
సృజనాత్మకతను చాటండి. లక్షల ప్రైజ్ మనీ గెలవండి
 
హైదరాబాద్ తలమానికంగా భాసిల్లుతున్న "థ్రిల్ సిటీ-అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్".. సోషల్ మీడియా ప్రభావాశీలుర సృజనాత్మకతకు సవాలు విసిరింది. 
 
అసాధారణమైన, అద్భుతమైన అనేక విశేషాల సమాహారంగా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్న"థ్రిల్ సిటీ-థీమ్ పార్క్"లోని ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్ లాంటి వందలాది యాక్టివిటీస్'ని బేస్ చేసుకుని షూట్ చేసిన వీడియో రీల్‌ను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల నుంచి అత్యుత్తమమైన వీడియో రీల్స్ మూడింటిని ఎంపిక చేసి, తలా లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెర తీసింది.
 
యంగ్ టాలెంట్‌ను కూడా యంకరేజ్ చేసే "థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయన్సర్ ఛాలెంజ్" ఈవెంట్ కర్టెన్ రైజర్ వేడుకకు ముఖ్య అతిధిగా టాలీవుడ్ యువ సంచలనం విశ్వక్సేన్ విచ్చేశారు. "ఈ రోజున సోషల్ మీడియాపై ఆధారపడని వ్యవస్థ, వ్యాపార రంగమంటూ ఏదీ లేదని, టాలెంట్ ఎవరి సొత్తూ కాదని, క్రియేటివిటీ కలిగిన ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా పట్టం కడుతుందని ఈ సందర్భంగా విశ్వక్సేన్ పేర్కొన్నారు. ఇందులోకి కొత్తగా ప్రవేశించేవాళ్ళు కూడా ఇందులో బ్రహ్మాండంగా రాణించవచ్చని ఆయన అన్నారు.
 
"థ్రిల్ సిటీ" సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్ కి కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న "బందూక్" లక్ష్మణ్ మాట్లాడుతూ... మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి, ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తామని" తెలిపారు. 
Thrill City Influencers Challenge Curtain Raiser
Thrill City Influencers Challenge Curtain Raiser
 
ఈ కార్యక్రమంలో థ్రిల్ సిటీ టీమ్ ఫీయాక్, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ స్వీకర్'తో పాటు హైదరాబాద్ వ్యాప్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.