#సిత్తరాలసిరపడు వైరల్.. కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తున్న అల వైకుంఠపురంలో (video)
''సాము సేసి కండతోటి దేనికైన గట్టి పోటి అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు... సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు... గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు'' అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటను వాట్సాప్ స్టేటస్‌లలో వుంచి నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హ్యాట్రిక్ కొట్టేసారు. వీరి కాంబినేషన్‌లో సంక్రాతికి వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఈ సంక్రాంతి సినిమా కలెక్షన్స్ సునామీతో దూసుకుపోతోంది. ఈ నేఫథ్యంలో ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. జనవరి 19న తేదీన ఈ సినిమా సక్సెస్ మీట్ జరుగనుంది.
జనవరి 12న విడుదలైన ఈ సినిమా దర్బార్, సరిలేరు నీకెవ్వరు మూవీలతో తలపడుతూ దీటైన వసూళ్లను రాబడుతోంది. అల వైకుంఠపురం గ్లోబల్ థియేట్రికల్ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ అతి త్వరలోనే లాభాల బాట పట్టనున్నారు.