శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:52 IST)

వెల్లువ -లో - చెప్పకు సారీ - అంటూ గీతాన్ని ఆడి పాడిన అలీ

Ali- Ranjit
రంజిత్, సౌమ్య మీనన్ (కేరళ), అలీ, రావు రమేష్, పెద్ద నరేష్, నటీనటులు గా మైల రామకృష్ణ దర్శకత్వంలో M. కుమార్ , M. శ్రీని వాసులు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం `వెల్లువ`. ఈ చిత్రం  షూటింగ్ హైదరాబాద్ లోని సైనిక్ పురి లోగల హైజాక్ బిస్ట్రో లో  అలీ పై 'చెప్పకురా మామా నువ్వు చెప్పకు సారీ..సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. 
 
ఈ సందర్భంగా  అలీ మాట్లాడుతూ, చిత్ర నిర్మాత కుమార్ మనీషా ఫిల్మ్స్ లో 20 సంవత్సరాలుగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు, ఇప్పుడు ఈ చిత్రాన్నీ శ్రీనివాస్ గారితో కలిసి నిర్మిస్తున్నాడు. హీరో రంజిత్ కి ఇది మూడవ సినిమా. రంజిత్ తో గతంలో `జువ్వ`  మూవీ చేసాను. ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ అద్భుతమైన పాటలు అందించాడు.ఇందులో నాతో  "చెప్పకురా మామా ..నువ్వు చెప్పకు సారీ ..పాటను పాడించారు.  ఇందులో హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు ఇది బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న కథ . అక్టోబర్ లో  విడుదల అవుతున్న ఈ సినిమా చిత్ర యూనిట్ కు పెద్ద విజయం  సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.. అన్నారు.
 
చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్ తో వస్తున్న చిత్రమిది. నిర్మాతలు నాకేం కావాలో అన్ని సమకూర్చారు. కొవిడ్ కారణంగా లేట్ అయినా  సినిమా చాలా బాగా వచ్చింది. ఘంటాడి కృష్ణ సంగీతం, బాల్ రెడ్డి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. హీరో రంజిత్, అలీ గార్లతో  చేసే ఈ పాటతో తో సినిమా పూర్తయింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. 
 
హీరో రంజిత్ మాట్లాడుతూ, అలీ గారితో కలసి పాట చేస్త‌న్నందుకు ఆనందంగా ఉంది .ఇలాంటి మంచి సినిమా లో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 
 
చిత్ర నిర్మాత ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, జీవనోపాధి తర్వాతే లవ్, పెళ్లి అనే మంచి కాన్సెప్టు తో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందిస్తున్నాము. ఇందులో నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు .మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ  ఆశీర్వదించాలని కోరుచున్నాను అన్నారు. 
 
 సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ, దర్శక, నిర్మాతలకు సినిమాపై  అభిరుచి ఉండడం వల్లే  పాటలు సంద‌ర్భానికి తగ్గట్టు  బాగా వచ్చాయి. ఈ సినిమా నేను అందించిన  మ్యూజిక్ నా కెరీర్లో  మైల్ స్టోన్ గా నిలుస్తుంది అని భావిస్తున్నాను  అన్నారు.