శనివారం, 2 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (10:51 IST)

అలియాకు కోపం వచ్చింది.. అది నా తప్పుకాదు.. నేనేమీ చేయలేను..

Alia
దివంగత స్టార్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం సమయంలో బాలీవుడ్‌ మాఫియా, నెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తింది. అమీర్‌ఖాన్‌ లాల్‌సింగ్‌చద్దా విడుదల సమయంలో నిప్పురవ్వలా మొదలైన బాయ్‌కాట్‌ ట్రెండ్‌ కార్చిచ్చులా మారింది. ఆ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.

దాంతో.. ఆ చిత్ర కథానాయిక కరీనాకపూర్‌ ఇష్టం లేకపోతే సినిమా చూడటం మానేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారమే రేపాయి. ఇప్పుడు ఇదే విషయంలో అలియా కూడా నోరు జారడంతో ట్రోలింగ్‌ ఇటువైపు మళ్లింది. నటి అలియా మాటల వల్ల ఇప్పుడు ఆ సెగ బ్రహ్మాస్త్రకు తగిలేలా ఉంది.

బ్రహ్మాస్త్ర సినిమాలో.. రణ్‌బీర్‌, అలియా, నాగార్జున, అమితాబ్‌ ఇలా పెద్ద తారలే నటిస్తున్నారు. బ్రహ్మస్త్ర సినిమాకు మొత్తంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టారు.

తాజాగా అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పా? మీకు నేను ఇష్టం లేకపోతే నన్ను చూడొద్దు. నేనేమీ చేయలేను" అని పేర్కొంది. దీంతో అలియా వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ను బాయ్‌కాట్ చేద్దామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.