బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (13:32 IST)

హృదయం కాలేయం.. రాజమౌళి ట్వీట్.. సోషల్ మీడియాతో దశ తిరిగింది.. సంపూ

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ అలీతో ఓ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సంపూర్ణేష్ పలు విషయాలు వెల్లడించాడు. తనను హీరోగా పెట్టి ఒకతను సినిమా తీస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని మా ఆవిడకు చెప్తే.. అసలు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీసేదెవరు అంటూ అడిగిందని చెప్పాడు. "మా ఊళ్లో నేను ఒక షాపు పెట్టుకుని గోల్డ్‌స్మిత్‌గా చేస్తుండేవాడినని తెలిపాడు. 
 
సొంతిల్లే అయినప్పటికీ.. షాపు అద్దె మాత్రం నెలకి రెండు వేలు. అప్పటికే తనకు పెళ్లై పాప కూడా వుందని.. నెలకి ఓ పది .. పదిహేను వేలు ఆదాయం వచ్చేది. సీజన్ కాకపోతే అంతకూడా వచ్చేవి కాదని చెప్పాడు. షాపుకు వెళ్లడం, పని చూసుకుని ఇంటికి రావడం తన పని అని సంపూర్ణేష్ చెప్పేవాడు. 
 
అప్పుడప్పుడు మాత్రం జేబులో ఓ అయిదు వందలు పెట్టుకుని హైదరాబాద్ వచ్చేవాడిని. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి .. తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయనగా మా ఊరుకి వెళ్లిపోయేవాడిని. అలా మొత్తానికి ఒక సినిమా లైన్లోకి వచ్చిందని చెప్పాడు. అలా ఓ కుదిరింది. ఈ విషయాన్ని భార్యకు చెప్తే భార్య నవ్వేసిందని తెలిపాడు. 
 
హృదయం కాలేయం సినిమా ద్వారా ముందు బాగా తిట్లే వచ్చేవి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ సినిమాను మెచ్చుకున్నారు. హృదయం కాలేయం సినిమా ద్వారా సోషల్ మీడియాను బాగా వాడుకున్నానని సంపూర్ణేష్ చెప్పాడు. హృదయం కాలేయం సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.

సెటైరికల్ సినిమా చేయడం సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను విడుదల చేయడం తనకు ఎంతో కలిసి వచ్చిందని.. ఇంకా రాజమౌళిగారు ట్వీట్ చేయడంతో తన దశాదిశా మారిపోయిందని సంపూర్ణేష్ బాబు వెల్లడించాడు.