Art director A.S. Prakash
ఆర్య సినిమా ద్వారా కళాదర్శకుడిగా పరిచయమైన ఎ.ఎస్. ప్రకాష్ ఆ తర్వాత సింహా, లెజెండ్, దూకుడు, అల వైకుంఠపురంలో వంటి ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట చిత్రానికి పనిచేశారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం గురించి సోమవారంనాడు విలేకరుల సమావేశంలో ఎ.ఎస్. ప్రకాష్ పలువిషయాలు తెలియజేశారు.
కథ విన్నాక ఎలా ఫీలయ్యారు?
దర్శకుడు పరశురామ్ చెబుతున్నప్పుడు ఇది కమర్షియల్, యాక్షన్ ఎంటర్‌టైనర్ అన్నారు. ఆల్‌రెడీ అంతకుముందే కొన్ని సినిమాలు చేసిన అనుభవంతో ఇది మరింత జాగ్రత్తగా చేయాలని మొదలు పెట్టాను.
మహేష్‌బాబుతో ఏడు సినిమాలు చేశారు గదా. ఎలా అనిపిస్తుంది.
మహేష్‌బాబుతో దూకుడు సినిమాతో నా కెరీర్ మొదలయింది. శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు చేశాను. సర్కారు వారి పాట అనేది ఏడవ సినిమా. ఆయనతో పనిచేయడం చాలా సరదాగా వుంటుంది. సెట్లో ఎంత జోవియల్‌గా వుంటారో పని విషయంలో అంత కేర్ తీసుకుంటారు. స్పాట్‌లో అన్ని విషయాలు చర్చిస్తాం. సాంగ్స్ విషయంలో సెట్ ఏరకంగా వుండాలి, యాక్షన్ అప్పుడు ఎలా వుండాలి. ఇంటి సెట్ వేస్తున్నప్పుడు ఎలా ఉండాలనే విషయాలన్నీ చర్చిస్తాం.
హీరోలకు ఆర్డ్ డైరెక్షన్ గురించి అవగాహన వుంటుందా?
నాకు తెలిసి హీరోలందరికీ టెక్నికల్ విషయాలపై చాలా అవగాహన వుంది. బయట ప్రపంచంలో చాలా విషయాలు తెలుసుకోవడంతో ప్రతి డిపార్ట్మెంట్ హెడ్‌తోనూ చర్చించి మంచి వర్క్ రాబట్టడానికి సహకరిస్తారు. ఒక్సోరారి పలాలా టెక్నీషియన్ కావాలని వారే ప్రిఫర్ చేస్తారు. హీరోలకు అంత అబ్జర్‌వేషన్ వుంది.
సర్కారు వారి పాట కోసం వేసిన బ్యాంక్ సెట్ గురించి వివరిస్తారా?
ఈ కథ నేపథ్యమే బ్యాంక్ గురించి. మొదట మూడు బ్యాంక్‌లు అనుకున్నాం. అందులో 50 ఏళ్ళ నాటి బ్యాంక్ ఎలా వుంటుంది. ఆ తర్వాత ఇప్పటి బ్యాంక్ ఎలా వుంది. అనేవి పరిశీలించి అందుకు తగిన విధంగా సెట్ వేశాం. బ్యాంక్ ఇంటీరియర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ఇందుకోసం గోవా, వైజాగ్ వంటి ప్రాంతాలను పర్యటించి బ్యాంక్‌లను పరిశీలించి డిజైన్ చేశాం. బ్యాంక్‌లో యాక్షన్ కూడా తీశారు. అందుకే అన్నపూర్ణ స్టూడియో సెట్ వేశాం. 50ఏళ్ళ నాటి బ్యాంక్ ఫర్నిచర్ ఎలా వుంటుంది. బ్యాంక్ బయట, లోపల ఏవిధంగా డిజైన్ చేయాలనేది ఆర్ట్ డైరెక్టర్‌గా నా పనితనం చూపించా.
కెమెరామెన్‌కీ, ఆర్డ్ డైరెక్టర్ కీ మధ్య ఎలాంటి అవగాహన వుండాలి?
ఏ సినిమాకైనా కథ విన్నాక కెమెరామెన్‌కీ ఓ విజన్ వుంటుంది. ఆర్ట్ డైరెక్టర్‌గా నాకూ ఓ విజన్ వుంటుంది. మా ఇద్దరివీ సింక్ అయితే ఎలివేట్ అయ్యేలా వారు లైటింగ్, కలర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఈ కెమెరామెన్ నేను కలిసి మిర్చి, రన్‌రాజా రన్ చేశాం. మిర్చికి తను కొత్త. నేను వేసిన కలర్, సెట్‌కు ఆయన ఫిదా అయ్యారు. దాంతో మా ఇద్దరి మధ్య మంచి సంబందముంది. అలాగే సరిలేరు నీకెవ్వరూ..లో కొండారెడ్డి బుజురు సెట్ వేశాం. అది మా ఇద్దరికీ బాగా సింక్ అయ్యాకే అది ఫైనల్‌గా మంచి ఔట్‌పుట్ రావడానికి దోహదపడుతుంది.
ఓన్లీ బ్యాంక్ సెట్ వేశారా? ఇంకా ఏమైనా వున్నాయా?
వైజాగ్, గోవా బ్యాక్‌డ్రాప్‌లో కథ జరిగేటప్పుడు అక్కడ కొన్ని వీధులు కూడా సెట్ వేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో ఓ కాలనీని తీసుకుని వీధి సెట్ వేశాం. గోవాలో అయితే వీది సెట్‌ను వేయడానికి 40 రోజులు పట్టింది.
`దూకుడు` చిత్రానికి ఈ సినిమాకు ఆర్ట్ విషయంలో ఎంత తేడా గమనించారు?
అప్పట్లో దూకుడు పెద్ద సినిమా. తర్వాతర్వాత బడ్జెట్ పెరగడం, మెటీరియల్, లేబర్ పెరగడంతోపాటు లావిష్‌గా చూపించడంకోసం బడ్జెట్ అనేది పెరుగుతుంది. నిర్మాత కథ ప్రకారం ఎంత పెరిగినా ఆయన వాటిని సమకూరుస్తుంటారు.
పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వచ్చేశాయి. దాని వల్ల కళా దర్శకత్వంలో మీకు ఒత్తిడి పెరిగిందా?
ఏదైనా రిలీజ్‌కు ముందు పాన్ ఇండియా సినిమా అవ్వదు. కథ ప్రకారం సెట్ వేస్తాం. ఒత్తిడి లేదుకానీ ఒళ్ళు దగ్గరపెట్టుకుని పనిచేయడమే మాకు తెలిసింది. ఈ సినిమాలో రెండు పాటలను సెట్లోనే తీశారు. బయట లొకేషన్ దొరకదు. దర్శకునితో చర్చించాక ఊహకు తగిన సెట్ వేసి తీస్తాం.
ఆర్ట్ దర్శకుడిగా మీకు స్పూర్తి ఎవరు?
నాకు గురువు అంటూ ఎవరూ లేరు. నేను ఆంధ్ర యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. అక్కడే కలర్ విషయంలో ఇతరత్రా ఎలా సెట్‌కు ఉపయోగించాలనేది తెలుసుకున్నాను. ఎవరిదగ్గర చేయకుండానే ముందుగా ఆర్య సినిమాకు పనిచేశాను.
ఒకప్పటికి ఇప్పటికీ ఆర్ట్ దర్శకత్వంలో మార్పులు ఏమి గమనించారు?
బ్లాక్ అండ్ వైట్ సినిమాలనుంచి ఇప్పటివరకు చూసుకుంటూ ఇప్పుడే ఆర్ట్ వర్క్ బాగా పెరిగింది. సోషల్ మీడియా పెరిగాక అందరూ చదువుకుని ఈ రంగంలోకి రావడంతో కొత్త కొత్త ఆలోచనలతోపాటు పనివిధానం కొత్తగా వుండాలనేది పెరిగింది. గతంలోలేని ఒత్తిడి ఇప్పుడు గమనిస్తున్నాం.
అవార్డుల గురించి మీరేమంటారు?
ఒక్కోసారి కొన్ని సెట్లు వేస్తే అవి నాచురల్‌గా వుంటాయి. అలవైకుంఠపురంలో ఇంటీరియర్ అనేది మొత్తం సెట్ వర్క్. కానీ సినిమాలో అది నాచురల్‌గా అనిపిస్తుంది. అవార్డుకు వెళితే మా పని కనిపించదు. దాంతో కొన్నిసార్లు అవార్డులు మిస్ అవుతాయి కూడా. \అలవైకుంఠపురంలో.. చేశాక చాలామంది ఫోన్లు చేసి మెచ్చుకున్నారు. అదే మాకు పెద్ద అవార్డు. ఇక ఇప్పుడు ప్రభుత్వ అవార్డులు అనేవి మర్చిపోయాం. రాష్ట్రం విడిపోయాక వాటి గురించి అస్పలు పట్టించుకునేవారు లేరు.
సాంకేతిక పెరిగాక మీ పని ఇంకా సులువు అనిపిస్తుందా?
టెక్నాలజీ ఎంత పెరిగితే వర్క్ అంత పెరిగింది. సీజీ వర్క్ చేసే వారికి కూడా మేం డిజైన్ వేసి చూపించాలి. నిర్మాతకు బడ్జెట్ గురించి చెప్పాలి. ఏదిఏమైనా టెక్నాలజీ వల్ల పని పెరిగింది.
కోవిడ్ వల్ల అన్నీ సెట్‌లోనే సినిమాలు చేస్తున్నారు? పని ఎక్కువయిందా?
అవును. పని పెరిగింది. ఈ సినిమాకు గోవాలో సెట్ వేశాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో సెట్ వేశాం. ఆ క్రమంలో బడ్జెట్ కూడా పెరుగుతుంది.
ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్లు కూడా విదేశాలనుంచి వస్తున్నారుగదా?
నిర్మాత, ప్రేక్షకులు మాత్రమే ఇక్కడివారు. మిగిలిన టెక్నీషియన్లు అంతా విదేశాలనుంచి వస్తున్న సందర్భాలు చాలా వున్నాయి.
మీకు ఏటువంటి తరహా చిత్రం చేయాలనుంది?
సోషియో ఫాంటసీ సినిమాలకు చేయాలనుంది.
కొత్త సినిమాలు?
చిరంజీవిగారి భోళాశంకర్, బాలకష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు పనిచేస్తున్నా.