మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (13:40 IST)

మైసూరులో దారుణం- ఫోనులో గంటలపాటు గడిపింది... అందుకే..?

murder
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమె గొంతుకోసి కడతేర్చాడు భర్త. 
 
వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లాలోని కావేరిపుర గ్రామానికి చెందిన అశోక్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య వనజాక్షి ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేది. 
 
వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్న సమయంలో వనజాక్షి ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లోనే కాలం గడుపుతుండేది.
 
నిందితుడిని క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే అశోక్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
విచారణలో భార్యను హత్య చేసినట్లు అశోక్ ఒప్పుకున్నాడు. ఎప్పుడూ ఫోనులో ఎవరితోనూ మాట్లాడుతుండేదని అందుకే వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానంతో చంపేశానని చెప్పాడు.