గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (20:14 IST)

ప్రధాని మోడీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

deenanath award
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ప్రధానం చేశారు. ప్రఖ్యాత గాయని లాతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీకి దీన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
 
కాగా, కరోనా వేళ పూణేలోని మంగష్కర్ ఆస్పత్రి ఎన్నో సేవలు అందించిందని కితాబిచ్చారు. యోగా, ఆయుర్వేదంలో మన దేశంలో ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మన దేశ మూలాల్లోనే పర్యావరణ పరిరక్షణ సూత్రాలు ఇమిడివున్నాయని తెలిపారు.