గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (12:36 IST)

ప్రధాని మోడీతో భేటీ అయిన ఏపీ గవర్నర్ హరిచందన్

harichandan - modi
ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. వారిద్దరూ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ఆయన ఇప్పటికే కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కూడా ఢిల్లీలోనే ఉన్న ఆయన శనివారం సాయంత్రం ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆదివారం కూడా అక్కడే ఉండి సోమవారం సాయంత్రానికి విజయవాడకు చేరుకోనున్నారు. 
 
కాగా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా నివేదికలు తెప్పించుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులోభాగంగా, తెలంగాణ, తమిళనాడు గవర్నర్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఇపుడు ఏపీ గవర్నర్ హరిచందన్‌ కూడా ఢిల్లీకి వెళ్లి ఈ నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో వివిధ రాష్ట్రాల గవర్నర్లు వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.