శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (14:01 IST)

సొంత రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ కానుకల వర్షం

Narendra Modi
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకల వర్షం కురిపించారు. ఇందులోభాగంగా గ్లోబల్ మెడిసిన్ సెంటర్, డెయిరీ కాంప్లెక్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, మంగళవారం బనస్కాంతలోని దేవదార్‌లోని బనాస్ డెయిరీ కాంప్లెక్స్‌‍లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. 
 
అంతేకాకుండా, జామ్ నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబెల్ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో మొత్తం 22 వేల కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ ప్రాజెక్టులను బహుమతిగా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ఆయన ప్రకటించారు.