ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (18:54 IST)

బ్రహ్మానందంతో గంటపాటు జోక్‌లు ఆస్వాదించిన అల్లు అర్జున్‌

Brahmanandam, Allu Arjun
Brahmanandam, Allu Arjun
హాస్య నటుడు బ్రహ్మానందంతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ శ్రావణ శుక్రవారంనాడు గంటన్నరపాటు గడిపారు. ఆయన ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే గతవారంనాడు బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్‌ వివాహం డాక్టర్‌ ఐశ్వర్యతో జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సి.ఎం.కూడా హాజరయ్యారు. సినీప్రముఖులు హాజరయ్యారు. కానీ అల్లు అర్జున్‌కు వ్యవధిలేక హాజరుకాలేదు. అందుకే ఈరోజు వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. 
 
Brahmanandam, Allu Arjun, Siddharth, Dr. Aishwarya, Lakshmi Kanneganti
Brahmanandam, Allu Arjun, Siddharth, Dr. Aishwarya, Lakshmi Kanneganti
అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమనటుడు అవార్డు రావడం పట్ల బ్రహ్మానందం చాలా ఆనందం వ్యక్తం చేశారు. అల్లుఅర్జున్‌కి అభినందనలు తెలిపారు. వారిద్దరి మధ్య టాపిక్‌ చాలా సరదాగా సాగింది. అల్లు అర్జున్‌ ఇంటిలోకి ప్రవేశించడానికి వస్తుండగా.. రండి... జాతీయ ఉత్తమనటుడు, మాలాంటివారికి ఐకాన్‌ అంటూ.. బ్రహ్మానందం.. అనగానే.. ఏంటీ.. నిజమా! అని ప్రశ్నార్థకంగా చూడగానే.. అబ్బే.. అందరూ అంటున్నారు.. అని సదరాగా బ్రహ్మీ చెప్పడం.. ఇలా వారిద్దరి మధ్య జోక్ ల  సంభాషణ సాగిందని తెలిసింది. ఇద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు.ఈ సందర్భంగా బ్రహ్మానందం చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మానందం కుటుంబం మెగా కుటుంబానికి బంధువు కూడా.