బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (17:07 IST)

వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లోనూ త‌గ్గేదేలే అంటున్న అల్లు అర్జున్

Allu Arjun, Jomato
తగ్గేదేలే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టైల్లో  చెప్పిన డైలాగ్ అన్నింటిలోనూ ఉప‌యోగించుకుంటున్నారు. ఆ డైలాగ్ చాలా పాపుల‌ర్ అయింది. టీవీ షోల‌లోనూ, మేరేజ్ ఫంక్ష‌న్ల‌లో సంద‌ర్భానుసారంగా వాడుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా త‌న డైలాగ్‌లో ఓ వ్యాపార ప్ర‌క‌ట‌న‌కు వాడేసుకున్నాడు. హీరోగా సినిమా స‌క్సెస్ కాగానే మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు హీరోలకు భారీ ఆఫ‌ర్లు చేస్తున్నాయి.
 
మ‌హేష్‌బాబు, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌లు పలు కంపెనీలకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. తాజాగా అల్లు అర్జున్.వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి యాడ్స్ తో రెచ్చిపోతున్నాడు.  
 
తాజాగా జొమాటో ని ప్రమోట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రకటన సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. ఈ యాడ్ లో బన్నీ తో పాటు నటుడు సుబ్బరాజ్ కూడా కనిపించారు. షూటింగ్ లో సుబ్బరాజ్ తో ఫైట్ సీన్ లో అతడిని గాల్లోకి లేపుతాడు. ఆ షాట్ స్లో మోషన్ లో ఉండగా సుబ్బరాజ్.. బన్నీ మధ్య సంభాషణ నవ్వులు పూయిస్తుంది. ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా అంటూ బన్నీ చెప్తాడు. ఏం కావాలన్నా .. ఎప్పుడు కావాలన్నా సూపర్ ఫాస్ట్ గా జొమాటో అందిస్తుంది.. మనసు కోరితే తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో బన్నీ చెప్పిన ఆదిలాగ తో యాడ్ ముగుస్తోంది. ప్రస్తుతం ఈ యాడ్ లో అల్లు అర్జున్ స్ట‌యిలిష్‌గా క‌నిపిస్తుంది. బన్నీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.