ఫేవరేట్ నటుడు సిద్ధికీతో చేయబోతున్నా : ఎమీ జాక్సన్
ప్రభాస్ ఇండియన్ ఐకాన్ అయితే.. సూపర్ స్టార్ మహేష్‌బాబు అని వీరిద్దరితో దక్షిణాది సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. ఎమీ జాక్సన్ తెలియజేస్తుంది. బ్రిటీష్ మోడల్ నటి అయిన ఎమీ లూయిస్ జాక్సన్ తొలిసారిగా తమిళ సినిమాల్లో నటించింది. '1940 ప్రేమకథ' చిత్రంలో నటించిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాల్లో చేసింది. విక్రమ్ సరసన 'ఐ' చిత్రంలో నటించింది.
లేటెస్ట్‌గా.. తమిళంలో 'తాండవం', రోబో 2.0 చిత్రాల్లో నటిస్తోంది. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో చేయడం అదృష్టంగా ఫీలవుతున్నట్లు చెబుతోంది. అయితే.. హిందీలో అవకాశాలు వస్తున్నాయనీ, త్వరలో బాంద్రా సొంత ఇంటిలో మకాం మారుతున్నట్లు చెప్తోంది.
ఈ నేపథ్యంలో తన ఫేవరేట్ నటుడు సనీరుద్దీన్ సిద్ధికి.. అని. అతనితో కొత్త సినిమా చేయడం చాలా ఆనందం కలుగచేస్తుందని చెప్పింది. స్క్రీన్‌పైన ఆయన నటన అద్భుతంగా వుంటుందని పేర్కొంది. ఇది చిన్న సినిమా అయినా.. పెద్ద నటీనటులు పలువురు నటిస్తున్నారని తెలిపింది.