శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (11:55 IST)

బాలీవుడ్ నటి అనన్య పాండే నివాసంలో విషాదం

బాలీవుడ్ నటి అనన్య పాండే నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఆమె నాన‌మ్మ స్నేహలతా పాండే వ‌యోభారం, వృద్ధాప్యం కారణంగా క‌న్నుమూశారు. అనన్య తండ్రి చుంకీ పాండే తన తల్లి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. 
 
ఈ అంత్యక్రియల్లో అన‌న్య‌తో పాటు ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తున్నాయి.
 
అనన్య పాండే ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతున్న 'లైగ‌ర్' సినిమాలో క‌థానాయికగా న‌టిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు ముంబైలోఈ మూవీకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. 
 
ఆ స‌మయంలో పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ అన‌న్య ఇంట్లో సంద‌డి చేయ‌గా, అందుకు సంబంధించిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త్వ‌ర‌లో 'లైగ‌ర్' మూవీ త‌దుప‌రి షెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.