పొట్టి దుస్తులలో హాట్ యాంకర్..చూస్తే మతి పోవాల్సిందే

Last Updated: బుధవారం, 14 ఆగస్టు 2019 (17:35 IST)
జబర్దస్త్‌తో హాట్ యాంకర్‌గా పరిచయమై, ఆ తర్వాత నటిగా, టీవీ యాంకర్‌గా తన అందాలతో సోషల్ మీడియాతో పాటుగా అభిమానులకు హీటెక్కిస్తోంది.


ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలలో అడపాదడపా హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను అలరింపజేస్తున్న అనసూయ.. మరోసారి పొట్టి దుస్తులలో కనిపించి కనువిందు చేసింది. సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొనడానికి ఖతార్ వెళ్లిన అనసూయ పొట్టి దుస్తుల్లో తళుక్కున మెరిసిపోయింది. 
 
సైమా ఫంక్షన్ కోసం అనసూయ ఖతార్ చేరుకున్నట్టు సైమా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఆ ప్రకటనతో పాటు రెండు ఫొటోలు కూడా జతచేశారు. ఈ ఫొటోలు చూస్తుంటే అనసూయ చాలా పొదుపుగా బట్టలు వేసుకున్నట్లు అర్థమవుతోంది. బాటమ్ షార్ట్స్, దానిపై ఎరుపు రంగులో ఇన్నర్, దానిపై చుక్కల షర్ట్.. ఈ డ్రెస్‌లో అనసూయ సో సెక్సీగా ఉంది.
 
కాగా, ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక రేపటి (ఆగస్టు 15) నుంచి ఖతార్‌లోని దోహలో మొదలుకానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఎప్పటిలాగానే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, గాయనీగాయకులు తదితర విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఇదిలా ఉంటే, ఈసారి సైమా అవార్డులకు టాలీవుడ్ నుంచి ‘రంగస్థలం’ అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఇందులో అనసూయ కూడా ఉత్తమ సహాయనటి విభాగంలో ‘రంగస్థలం’ నుంచి నామినేట్ అయ్యింది. ఈ విభాగంలో అనసూయకు పోటీగా రమ్యకృష్ణ, ఆశా శరత్, జయసుధ, సుప్రియలు నామినేట్ అయ్యారు. దీనిపై మరింత చదవండి :