యూనిట్ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో.. 400 మందికి ఉంగరాలు

ప్రీతి| Last Updated: బుధవారం, 14 ఆగస్టు 2019 (17:14 IST)
కోలీవుడ్ హీరో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన హీరోగా ‘బిగిల్‌’ అనే తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన అర్చనా కలపతి సోషల్‌ మీడియాలో అభిమానులతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.


అదేంటంటే...బిగిల్‌ సినిమా కోసం వివిధ విభాగాలలో పని చేస్తున్న 400 మంది సభ్యులకు ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు దళపతి. బిగిల్ పేరును ముద్రించిన బంగారు ఉంగరాలను వీరందరికీ గిఫ్ట్ ఇచ్చారు విజయ్. ఇక బిగిల్‌లో నటిస్తున్న కూడా..విజయ్‌ ఇచ్చిన రింగ్‌ చూపుతూ ఫొటో దిగి ట్విటర్‌లో షేర్‌ చేశారు. బిగిల్‌ అంటే తమిళంలో విజిల్‌ అని అర్థం. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఇందులో విజయ్‌ లుక్స్‌ చూస్తుంటే అతడి క్యారెక్టర్‌లో మూడు నాలుగు షేడ్స్‌ ఉంటాయని అర్థం అవుతోంది. ఒకదానిలో విజయ్‌ యంగ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపిస్తుండగా, ఇంకో లుక్‌లో కత్తి పట్టుకుని మాస్‌ లుక్‌లో కనిపించాడు, మరోదాంట్లో సూటు బూటు వేసుకుని బిజినెస్‌మ్యాన్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి విడుదల చేసేలా సినిమా యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.దీనిపై మరింత చదవండి :