బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (16:58 IST)

యాంకర్ ప్రదీప్‌కు జైలుశిక్ష తప్పదా?

పీకల వరకు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసిన కేసులో పట్టుబడిన బుల్లితెర యాంకర్ ప్రదీప్‌కు శిక్షపడే అవకాశం ఉన్నట్టు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఆయన నేరాన్ని అంగీకరించడమేకాకుండా, భవిష్యత

పీకల వరకు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసిన కేసులో పట్టుబడిన బుల్లితెర యాంకర్ ప్రదీప్‌కు శిక్షపడే అవకాశం ఉన్నట్టు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ఆయన నేరాన్ని అంగీకరించడమేకాకుండా, భవిష్యత్‌లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు. ఇదే అంశాన్ని పోలీసులు చార్జిషీట్‌లో పొందుపరిచి కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో ఆయనకు కోర్టు శిక్ష వేసే అవకాశం ఉందనీ న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
గత యేడాది డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి కొత్త సంవత్సరం వేడుకల్ల్ పాల్గొన్న ప్రదీప్.. పీకల వరకు మద్యం సేవించి కారు నడిపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం గోషామహల్‌ ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో గంటసేపు జరిగిన కౌన్సెలింగ్‌కు తన తండ్రితో కలిసి హాజరయ్యాడు. 
 
ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ప్రదీప్‌ హామీ ఇచ్చినట్లు ట్రాఫిక్‌ అదనపు డీసీపీ అమర్‌కాంత్‌రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌ పూర్తయినందున, ఆయా విషయాలతో చార్జిషీట్‌ రూపొందించి కోర్టులో దాఖలు చేస్తామని, అతనికి జరిమానానా లేదా శిక్ష పడుతుందా? అన్న విషయాన్ని కోర్టు నిర్ధారిస్తుందని ఆయన వెల్లడించారు.