శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 4 జనవరి 2018 (20:11 IST)

బాబోయ్ పోలీసులు... యాంకర్ ప్రదీప్ పారిపోయాడా?

ఇదివరకు పోలీసు దుస్తుల్లో ఎవరయినా వ్యక్తి ఇంటి వైపు వస్తుంటే బెంబేలెత్తిపోయేవారు. గ్రామాల్లో పరిస్థితి అయితే మరీను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే యాంకర్ ప్రదీప్ వున్నాడా... పోలీసులు మాట చెబితే ప్రదీప్ జడుసుకుంటున్నాడా... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంక

ఇదివరకు పోలీసు దుస్తుల్లో ఎవరయినా వ్యక్తి ఇంటి వైపు వస్తుంటే బెంబేలెత్తిపోయేవారు. గ్రామాల్లో పరిస్థితి అయితే మరీను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే యాంకర్ ప్రదీప్ వున్నాడా... పోలీసులు మాట చెబితే ప్రదీప్ జడుసుకుంటున్నాడా... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. 
 
కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని పోలీసులు పంపిన ఆదేశాన్ని పట్టించుకోకుండా రెండు రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 45లో ప్రదీప్‌ దొరికిపోయాడు. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా ఆ టెస్టులో 178 పాయింట్లు నమోదైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపధ్యంలో తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడిన వ్యక్తి వారం రోజుల లోపుగా కౌన్సిలింగుకు రావాల్సి వుంటుంది. కానీ ప్రదీప్ మాత్రం డుమ్మా కొట్టాడు. ఈ రోజు ప్రదీప్ ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి కనిపించిందట. దీనితో ప్రదీప్ కేసును లా అండ్ ఆర్డర్ కు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. మరి ఇప్పటికైనా ప్రదీప్ కౌన్సిలింగుకు హాజరవుతారా లేదా చూడాల్సి వుంది.