మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (15:46 IST)

శ్రీనివాస్ 'గలీజ్' xxx వీడియోలు పగలు చూపిస్తారా? : తమ్మారెడ్డి (వీడియో)

లైంగిక వేధింపుల కేసులో అడ్డంగా బుక్కైన 'గజల్' శ్రీనివాస్ వీడియోలను పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ దుయ్యబట్టారు.

లైంగిక వేధింపుల కేసులో అడ్డంగా బుక్కైన 'గజల్' శ్రీనివాస్ వీడియోలను పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ దుయ్యబట్టారు. నిజానికి ఎక్స్ వీడియోలు రాత్రి 10 గంటల తర్వాతే చూపించాల్సి ఉంటుందనీ, కానీ గజల్ శ్రీనివాస్ ట్రిబుల్ ఎక్స్ వీడియోలు పగలు చూపిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
డిసెంబర్ 31 అర్థరాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్, లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ గురించి దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫేస్‌బుక్‌ వీడియోలో మాట్లాడారు. "హాయ్.. కొత్త సంవత్సరం కొత్త విషయాలు మాట్లాడదామని అనుకున్నాను కానీ, కొత్తవి కనబడటం లేదు. కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా చెప్పుకోవాలి.. మంచి జరుగుతుంది అనుకుంటే, మంచి కంటే చెడు ఎక్కువగా జరిగింది. చెడు అంటే చెడు కాదు.. చెడు లాంటిది. గజల్ శ్రీనివాస్ ని పట్టుకున్నారు. సంతోషం. తప్పుచేశాడు.. జైలుకి పంపించేశారు.. బాగుంది. 
 
కానీ, అందుకు సంబంధించిన వీడియోలను టీవీల్లో పగలూరాత్రీ అనే తేడా లేకుండా చూపిస్తున్నారు. మామూలుగా 'ఏ' సర్టిఫికెట్ సినిమాలను రాత్రి 10 గంటల తర్వాత వేయాలని అంటారు. కానీ, గజల్ శ్రీనివాస్ xxx వీడియోస్ చూపిస్తున్నారు. పగలురాత్రీ న్యూస్ ప్రసారం చేయొచ్చు కానీ, ఇలాంటి వీడియోలను ప్రసారం చేయొచ్చా? దీనికి సంబంధించిన పూర్తి వీడియోను ఓసారి చూడండి.