ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2018 (12:08 IST)

గుట్టంతా వీడియోలో ఉంది... ఇక గలీజు శ్రీనివాస్‌‌ వద్ద ఏంవిచారిస్తారు : జడ్జి ప్రశ్న

లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన గజల్ శ్రీనివాస్‌‌ వద్ద విచారణ జరిపేందుకు కస్టడీకి ఇవ్వాలన్న హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుల కోరికను పంజాగుట్ట కోర్టు జడ్జి నిరాకరించారు.

లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన గజల్ శ్రీనివాస్‌‌ వద్ద విచారణ జరిపేందుకు కస్టడీకి ఇవ్వాలన్న హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుల కోరికను పంజాగుట్ట కోర్టు జడ్జి నిరాకరించారు. ఆయన గుట్టంతా వీడియోల్లో తెలిసిపోయిందనీ, ఇకపై ఆయన వద్ద ఏమని విచారిస్తారంటూ పోలీసుల తరపు న్యాయవాదిని జడ్జి ప్రశ్నిస్తూ, కస్టడీ పిటీషన్‌ను కొట్టివేశారు. 
 
తన కార్యాలయంలోని ఉద్యోగిని లైంగికంగా వేధించిన ఘటనలో గజల్ శ్రీనివాస్ అడ్డంగా బుక్కైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో గజల్ శ్రీనివాస్‌ను కనీసం నాలుగు రోజుల పాటు విచారించి, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుంటామని చెబుతూ, పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన వేళ, న్యాయమూర్తి దాన్ని తిరస్కరించారు. 
 
ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్‌ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఏంటని జడ్జి ప్రశ్నించడం గమనార్హం. రిమాండ్ రిపోర్టులో విచారణకు సంబంధించిన వివరాలను పొందుపరిచి, వీడియోలతో సహా అన్ని ఆధారాలనూ సంపాదించిన తర్వాత ఆయన్ను ఏం విచారిస్తారని ప్రశ్నించారు. ఆయన్నుంచి ఎటువంటి రికవరీ అవసరం లేదని రిపోర్టులో పేర్కొన్నారు కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.