మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 6 జనవరి 2018 (09:52 IST)

కళను నీచ కార్యక్రమాలకు వాడుకుంటారా..? శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించండి

కళను అడ్డం పెట్టుకుని నీచాతి నీచ కార్యక్రమాలకు పాల్పడిన ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌పై సాంస్కృతిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలుల

కళను అడ్డం పెట్టుకుని నీచాతి నీచ కార్యక్రమాలకు పాల్పడిన ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌పై సాంస్కృతిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో గజల్ శ్రీనివాస్‌ ఉన్నాడు. ఇప్పటికే ''సేవ్ టెంపుల్'' ప్రచారకర్తగా శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాడు.
 
తాజాగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన శ్రీనివాస్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని.. అతనిని కఠినంగా శిక్షించాలని ''ఆనందలహరి'' సాంస్కృతిక సంస్థ డిమాండ్ చేసింది. అంతేగాకుండా శ్రీనివాస్‌ను తమ సంస్థ నుంచి సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన సాంస్కృతిక, కళా సంఘాలు కూడా తమ బాటనే అనుసరించాలని సూచించింది. 
 
గజల్ శ్రీనివాస్‌పై నమోదైన కేసును నీరుగార్చేందుకు కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించింది. కళను ఇటువంటి దుర్మార్గపు, నీచ కార్యక్రమాలకు వాడుకోవడం హేయమని ఆనందలహరి మండిపడింది. శ్రీనివాస్ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చాలని.. అతనిని కఠినంగా శిక్షించాలని ఆనందలహరి డిమాండ్ చేసింది. 
 
రేడియో జాకీని వేధించిన కేసులో గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలతో సహా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గజల్ శ్రీనివాస్‌ చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంది. ఇంకా బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది.