శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2025 (10:57 IST)

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

srimukhi
తాజాగా జరిగిన ఓ సినిమా వేడుకలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలు ఉంటూ యాంకర్ శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై శ్రీముఖిపై హిందూ సంఘాలు, భక్తులు భగ్గుమన్నాయి. పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని క్షమించాలంటూ శ్రీముఖి వీడియోలు వెల్లడించారు. 
 
హిందువులకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆమెపై భగ్గుమన్నారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పారు. తాను పొరపాటున రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ వ్యాఖ్యానించానని క్షమాపణలు కోరుతూ వీడియోను విడుదల చేశారు. 
 
తానూ హిందువునేనని, దైవభక్తురాలిని కూడా అని ఆ వీడియోలో తెలిపారు. అందులోనూ రాముడిని అమితంగా నమ్ముతానన్నారు. కానీ తాను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడూ జరగకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటానని తెలిపారు. 
 
ఇలాంటి పొరపాటు జరగదని అందరికీ మాట ఇస్తున్నానని, అందరినీ క్షమాపణలు కోరుతున్నానని, దయచేసి అందరూ పెద్ద మనసుతో తనను క్షమిస్తారని వేడుకుంటున్నానని వీడియోలో పేర్కొన్నారు.