గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: మంగళవారం, 5 మార్చి 2019 (21:35 IST)

వైరల్ అవుతున్న యాంటీ కౌశల్ యాంథెమ్... రాసిందెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో విన్నర్‌గా కౌశల్ నిలవడానికి ముఖ్య కారణం కౌషల్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన అభిమానుల బృందం. గత కొన్నాళ్లుగా ఆర్మీ కౌశల్‌కు ఎదురు తిరిగింది. తమను వాడుకోవడమే కాకుండా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు బయటికి వచ్చాయి. అంతే ధీటుగా కౌషల్ సమాధానమివ్వగా మీడియాలో ఈ వ్యవహారమంతా రచ్చ రచ్చ అయ్యింది.
 
ఇప్పుడు కౌశల్ ఆర్మీ మరో అడుగు ముందుకేసి ‘అందరూ గొర్రెలే' అంటూ ఇంటర్నెట్‌లో ఓ పాటను విడుదల చేశారు. ఇందులో కౌశల్ తీరును విమర్శిస్తూ లిరిక్స్ పొందుపర్చారు. కానీ ఈ పాటలో బీట్స్, బిజిఎమ్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైకి చెందిన అరవింద్ ఈ పాటను విడుదల చేసారు. 
 
ఒకప్పుడు భజన చేసి, ఇప్పుడు గొర్రెలుగా మారాము అంటూ విమర్శల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా అప్పట్లో కౌషల్ పుట్టించిన పుకార్ల గురించి కూడా వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ అన్న అనుకుంటే పీఎం కాల్ కూడా వస్తది, అన్న అనుకుంటే సీఎం సీటు కూడా వస్తది. అన్న అనుకుంటే భూమి రివర్స్ కూడా అవుతది, అన్న అనుకుంటే టెన్త్ పాస్ కూడా కాకుండా డాక్టరేట్ వస్తది... అంటూ సెటైర్లు వేసారు. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో మరి.