శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:07 IST)

అంతా తనీష్, తేజస్వి, బాబు గోగినేని కలిసి చేస్తున్న పనే.. బూతులు తిడితే?: కౌశల్

బిగ్ బాస్-2 విజేత తనీష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో ఓవియాకు ఎలా బిగ్ బాస్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి ఆర్మీలా మారిందో.. అలాగే కౌశల్ ఆర్మీ కూడా పుట్టుకొచ్చింది. కౌశల్ ప్రస్తుతం క్యాన్సర్ పేషెంట్లను దత్తత తీసుకుని చికిత్స అందిస్తున్నారు. ఇంకా భార్య కూడా క్యాన్సర్‌తో బాధపడుతుందని గురువారం మీడియాతో చెప్పుకొచ్చారు. 
 
కౌశల్ ఆర్మీ సభ్యులను రెచ్చగొట్టి వారి ద్వారా తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ట్రోల్ చేయిస్తున్నారనే ఆరోపణలపై కౌశల్ స్పందించాడు. తాను ఎవ్వరినీ ట్రోల్ చేయమని చెప్పలేదు. తనను నమ్ముకుని కౌశల్ ఆర్మీలో వున్న అమ్మాయిలను బూతులు తిడితే వారికి తగిన సమాధానం మాత్రమే ఇవ్వాలని చెప్పానని మీడియాతో కౌశల్ అన్నాడు. 
 
రోల్ రైడా వీడియో పెట్టినపుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఓ అమ్మాయి కామెంట్ పెడితే ఆమెను కొందరు బూతులు తిడుతూ కామెంట్ పెట్టారు. వారిని సమాధానం చెప్పండి అన్నట్లు కౌశల్ వివరణ ఇచ్చాడు. బూతులు తిట్టిన వారిపై ఆల్రెడీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తనతో సినిమా చేస్తానని చాలామంది తనను మోసం చేశారు. 
 
ఈ సందర్భంగా తనీష్‌కు థ్యాంక్స్ చెప్తున్నానని.. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లోనే బయటికొస్తే తడాఖా చూపిస్తానని చెప్పాడని.. కుట్రలు చేసి అలా తన మీద గెలిచాడని చెప్పుకొచ్చాడు. ఇదంతా చేయిస్తున్నది తనీషేనని కౌశల్ తెలిపాడు. బాబు గోగినేని గారు భారత్ వచ్చి తనపై ఆరోపణలు చేయాలని.. ఇక్కడ టీవీల్లో డిబెట్ పెడితే తానూ సిద్ధమేనని తనీష్ అన్నాడు. 
 
కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని ఆరోపణలు చేయడం కాదు నిరూపించండంటూ బాబు గోగినేనికి కౌశల్ పిలుపునిచ్చాడు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న తేజస్వి మదివాడ, దీప్తి సునైనా.. వీరంతా ఇన్నాళ్లు ఏమైపోయారని.. అంతకౌశల్ ఆర్మీ పేరుతో ఓ పది మంది వచ్చి టీవీ ఛానల్స్‌లో మాట్లాడితే నమ్మేస్తారా? ఇదంతా తనీష్, తేజస్వి, బాబు గోగినేని కలిసి చేస్తున్నదని కౌశల్ ధ్వజమెత్తారు. 
 
తేజస్వి కౌశల్ ఆర్మీని పట్టుకుని గొర్రెలు అంటోంది.. అలా అనడానికి ఆమెకు ఏం హక్కు ఉంది? అని ప్రశ్నించారు. బాబు గోగినేని.. యూకేలో కాదు.. హైదరాబాదుకు వచ్చి డిబేట్లు పెట్టండి. మీకు ఎన్ని టీవీలు సపోర్ట్ చేసినా ఏం పీకలేరని ఆవేశంతో కౌశల్ వార్నింగ్ ఇచ్చారు.