శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 5 జులై 2018 (20:00 IST)

సాయిధరమ్ తేజ్ అలా హగ్ చేస్కుంటుంటే జెలసీ ఫీలయ్యా: అనుపమ పరమేశ్వరన్(Video)

అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళకుట్టి తెలుగు సినీ పరిశ్రమలో బాగానే పాతుకుపోయింది. ఎక్కడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది. యువ హీరోలతో నటిస్తూ హిట్ల పరంపర కొనసాగిస్తోంది. కథ పరంగా ఆచితూచి కొంతమంది హీరోయిన్లు అడుగులు వేస్తుంటే అనుపమ పరమేశ్

అనుపమ పరమేశ్వరన్. ఈ కేరళకుట్టి తెలుగు సినీ పరిశ్రమలో బాగానే పాతుకుపోయింది. ఎక్కడా గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది. యువ హీరోలతో నటిస్తూ హిట్ల పరంపర కొనసాగిస్తోంది. కథ పరంగా ఆచితూచి కొంతమంది హీరోయిన్లు అడుగులు వేస్తుంటే అనుపమ పరమేశ్వరన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఏ సినిమా అయినా చేయడానికి సంతకాలు పెట్టేస్తోంది.
 
తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన తేజ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదల సంధర్భంగా అనుపమ పరమేశ్వరన్ సాయి ధరమ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇదే సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. సాయితేజ్ నిజంగా సూపర్. అతని డ్యాన్సు అదుర్స్. నేను సాయి ధరమ్ తేజ్‌కు పెద్ద ఫ్యాన్. చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు సాయితేజ్. 
 
తేజ్ సినిమాలో ఆయన డ్యాన్స్ చేసినప్పుడు ఆయనతో సమానంగా నేను డ్యాన్స్ చేయలేకపోయాను. డ్యాన్సే కాదు స్పీడుగా డైలాగ్‌లు చెప్పడం. సరైన సమయానికి షూటింగ్‌కు రావడం ఇదంతా సాయి ధరమ్ తేజ్‌కు ఉన్న మంచి అలవాటు. అంతేకాదు... షూటింగ్ సమయంలో తేజ్-కరుణాకర్ ఒకరికొకరు హగ్ చేసుకోవడం చూసి చాలా జెలసీ ఫీలయ్యాను అంటోంది అనుపమ. వీడియో చూడండి.