ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (09:13 IST)

'గౌతమిపుత్ర శాతకర్ణి'ని వీక్షించిన చంద్రబాబు.. సినిమా ఎలా ఉందని చెప్పారంటే...

సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలైన బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీక్షించారు. ఆయనతో పాటు.. చిత్ర హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్

సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలైన బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీక్షించారు. ఆయనతో పాటు.. చిత్ర హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియ, పలువురు రాష్ట్ర మంత్రులు విజయవాడలోని ట్రెండ్ సెట్ థియేటర్‌లో వారంతా ఈ చిత్రాన్ని వీక్షించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రం గురించి మాట్లాడుతూ... చిత్రం అద్భుతంగా తీశారని ప్రశంసించారు. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ... ‘దేశం మీసం తిప్పుదాం’ అనే డైలాగ్‌కు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాము ఊహించిన దాని కంటే భారీ విజయం దక్కిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండగ ముందుగానే వచ్చిందని, తమ చిత్రానికి విదేశాల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఈ చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చిన ఇరు రాష్ట్రాల సీఎంలకు బాలకృష్ణ తన కృతఙ్ఞతలు తెలిపారు.
 
ఇకపోతే.. శాతకర్ణి చిత్రాన్ని ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుపతిలో వీక్షించారు. తిరుపతిలోని మినీ ప్రతాప్ థియేటర్‌లో ఎన్టీఆర్ కుమార్తెలు లోకేశ్వరి, ఉమామహేశ్వరి, సీఎం చంద్రబాబు సోదరి హైమావతి, సోదరుడు రామ్మూర్తినాయుడు సతీమణి ఇందిర, ఎన్టీఆర్ చిన్నల్లుడు కంఠమనేని శ్రీనివాసరావు, మనవడు శ్రీనివాస్, ఎన్టీఆర్ కుమార్తె అల్లుడు శ్రీమాన్, చంద్రబాబు మేనల్లుడు కనుమూరి ఉదయ్, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు భరత్ తదితరులు సినిమాను వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.