సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మే 2020 (18:58 IST)

వెండితెరపై సూపర్ కాంబో.. ప్రభాస్- అరవింద్ స్వామి కలిసి..?

వెండితెరపై అద్భుత కాంబో తెరకెక్కబోతోంది. ప్రభాస్- అరవింద్ స్వామి కాంబోలో కొత్త సినిమా తెరకెక్కనుంది. బాహుబలి స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక భారీ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సోషియో ఫాంటసీని టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది.
 
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ స్టార్లు ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర ప్రస్తుతం చర్చనీయాంశమైందియ ఈ నేపథ్యంలోనే అరవింద్ స్వామి పేరు తెరపైకి వచ్చింది.
Aravind swamy
 
ఇటీవల కాలంలో స్టైలీష్ విలన్ పాత్రలకు అరవింద్ స్వామి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ప్రభాస్ సినిమా కోసం ఫోన్ లోనే అరవింద్ స్వామిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇందుకు అరవింద్ స్వామి అంగీకరించే అవకాశాలున్నాయని సినీ పండితులు అంటున్నారు. ఈ ఏడాది చివర్లో డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.