వెబ్ సిరీస్‌లలో దుమ్మురేపుతున్న లక్సు పాప
లక్సు పాప ఆశా షైనీ ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతోన్న అనేక వెబ్ సిరీస్‌లలో దుమ్ము రేపేస్తోంది. తనలాంటి చాలామందికి ఓటీటీ బెస్ట్ ఆప్షన్ అయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 143 ఐ లవ్ యూ సినిమాలో జర్నలిస్టు పాత్రలో ఆశా షైనీ నటించిన సంగతి గుర్తుండే వుంటుంది.
తెలుగు తెరపై మళ్లీ కనిపించాలనుకుంటున్నట్లు చెప్పిన ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌ల రాకతో వెండితెరపైనా మార్పులు వచ్చాయని అభిప్రాయపడింది.
అన్నీ ఒకే తరహా పాత్రలు, అందునా శృతిమించిన శృంగార సన్నివేశాలేనా.? అనడిగితే, సినిమాల్లోనూ నటీనటులు హద్దులు దాటేస్తున్న వైనాన్ని ప్రస్తావించింది.