శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:22 IST)

ఆహాను సబ్ స్క్రైబ్ చేసుకో భీమ్లా నాయక్ బైక్ గెలుచుకో

Bhimla Naik byke
ఓటీటీ సంస్థ ఆహా! కొత్త మార్కెటింగ్ ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్టింది. ఆహాను సబ్ స్క్రైబ్ చేసుకుని బౌక్‌ను సొంతం చేసుకోండ‌ని లాట‌రీ స్కీమ్‌ను రూపొందించింది. ప‌లు వ్యాపారాల‌ల‌లో ఒక‌టి కొంటే మ‌రోటి ప్రీ అంటూ ఈమ‌ధ్య తెగ ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే ఓటీటీ సంస్థ‌లు చాలా వుండ‌డంతో పోటీ ఏర్ప‌డింది. దాంతో కొత్త వ్యాపారానికి శ్రీ‌కారం చుట్టారు. 
 
తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్‌గా ఆహా ఓ కంటెస్ట్‌ను లాంఛ్ చేసింది. అందులో గెలిచిన‌వారికి భీమ్లా నాయక్ సినిమాలో ప‌న‌వ్ క‌ళ్యాణ్ ఉప‌యోగించిన బైక్‌ను గెలుచుకుంటారు. ఆహా ఓటీటీని ఏప్రిల్ 15 లోపు ఎవ‌రెవ‌రు సబ్ స్క్రైబ్ చేసుకుంటారో వారు ఈ కంటెస్టెంట్‌కు అర్హ త సాధిస్తారు. ఈ కంటెస్టెంట్‌ను రీసెంట్‌గా భీమ్లా నాయ‌క్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అనౌన్స్ చేశారు. 
 
Bhimla Naik byke
ఈ కంటెస్టెంట్‌లో భాగంగా భీమ్లా నాయక్‌లో ప‌వ‌న్ ఉప‌యోగించిన బుల్లెట్ బైక్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ఖ‌మ్మం, రాజ‌మండ్రి వంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో టూర్‌లా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి ఈ టూర్‌కు అద్భుత‌మైన వెల్‌క‌మ్ దొరుకుతుంది. త్వ‌ర‌లోనే ఈ బైక్ టూర్‌లో భాగంగా కొత్త‌గూడెం, విజ‌య‌న‌గ‌రం ప్రాంతాల‌కు చేర‌నుంది. 
 
ఇటీవ‌లే ఈ బైక్ వైజాగ్ న‌గ‌రానికి చేరుకుంది. దీనికి ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున స్వాగ‌తం ల‌భించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్.. ప‌వ‌ర్ స్టార్ అని రాసిన‌ టీ ష‌ర్ట్ ధ‌రించి వెల్ క‌మ్ చెప్పారు. కొంద‌రు ఫ్యాన్స్ ఆ బైక్‌ను ఆహా కేన్‌ట‌ర్ వ్యాన్ చుట్టూ న‌డిపారు కూడా.