'అవతార్-2' టీమ్‌కు షాక్.. రిలీజ్‌కు ముందే లీక్
ప్రపంచ వ్యాప్తంగా అమితాసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం "అవతార్-2". డిసెంబరు 16వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 13 యేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తొలి భాగం ఒక విజువల్ వండర్‌గా నిలిచి ప్రేక్షకులను సరికొత్త లోకానికి తీసుకెళ్లింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ కనకవర్షం కురిపించింది. దీనికి కొనసాగింపుగా ఇపుడు "అవతార్-2" వచ్చింది.
"అవతార్- ద వే ఆఫ్ వాటర్" పేరుతో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషలతో పాటు ఏకంగా 160 భాషల్లో విడుదల కానుంది. ఒక్క దక్షిణ భారతదేశంలోనే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే అంటే గురువారమే ఈ చిత్రం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లీకైంది. లండన్‌లో ఈ నెల 6వ తేదీన విడుదల కావడంతో ఈ చిత్రం కాపీని టెలీగ్రామ్‌తో పాటు టోరెంటో సైట్లలో అందుబాటులో ఉంచారు. దాంతో పలువురు దీన్ని డౌన్‌లోడ్ చేసి ఉచితంగా చూస్తున్నారు. చిత్రం లీంకులను సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు.