ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (04:15 IST)

తెలుగువాళ్లే ఇలాంటి రికార్డులు ఎలా బద్దలు కొడుతున్నారు..! బాహుబలి-2 పై తమ్మారెడ్డి భరద్వాజ ఆశ్చర్యం

బాహుబలి వెయ్యి కోట్లు చేసేసింది. బీబీసీ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడింది. అమెరికాలోనూ హయ్యస్ట్ గ్రాసర్ అయింది. బ్రిటన్‌లో కూడా హయ్యస్ట్ గ్రాసర్ అయిందని బీబీసీలో చెప్పారు. ఇండియాలో హయ్యస్ట్ గ్రాసర్. హయ్యస్ట్ గ్రాసర్ అనేది ఇక్కడ విషయం కాదు. ఇం

బాహుబలి వెయ్యి కోట్లు చేసేసింది. బీబీసీ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడింది. అమెరికాలోనూ హయ్యస్ట్ గ్రాసర్ అయింది. బ్రిటన్‌లో కూడా హయ్యస్ట్ గ్రాసర్ అయిందని బీబీసీలో చెప్పారు. ఇండియాలో హయ్యస్ట్ గ్రాసర్. హయ్యస్ట్ గ్రాసర్ అనేది ఇక్కడ విషయం కాదు. ఇంకో రెండు మూడు వారాలు దాన్ని ఆపలేని స్థితిలో ఉంది. అది ఎంత వసూలు చేయబోతోంది అనేది అంచనాకు అందటం లేదు. కానీ ఇప్పట్లో మరే సినిమా కూడా బాహుబలిని తాకలేదు. ఈ చరిత్రను ఎవరైనా మళ్లీ క్రాస్ చేయాలంటే మళ్లీ రాజమౌళికే సాధ్యపడవచ్చు కానీ ఇంకే సినిమా, మరెవరి సినిమా కూడా దీన్ని క్రాస్ చేయదు. చేసే అవకాశాలు కూడా లేవు.
 
మన తెలుగు వాళ్లు ఇలా రికార్డులు సృష్టించడంలో చాలా గొప్పవాళ్లు. ఉదా. సత్య నాదెళ్ల.. తెలుగువాడు. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ అయ్యాడు. అలాగే మన దాసరి నారాయణ రావు, రామానాయుడు, విజయనిర్మల, బ్రహ్మానందం వీరంతా తెలుగువాళ్లు.. గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. అలాగే ఎన్టీరామారావు గారు. ఎనిమిది మాసాల్లో ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకురాగలిగారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవారు ఎన్టీఆర్. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. ఆయన చెప్పినవి చాలావరకు జరుగుతున్నాయి. 
 
ఇంతటి మహామహుల కోవలోకి ఇవ్వాళ రాజమౌళి చేరారు. టెక్నాలజీ ఇవ్వాళ మారిపోయిన సమయంలో రాజమౌళి ప్రపంచం మొత్తంగా ఒకేసారి ఒకే రోజు మాట్లాడుకునే స్టేజికి తెలుగు సినిమాను తీసుకువచ్చారు. హాలీవుడ్ సినిమాలకు పోటీగా హయ్యస్ట్ రెవిన్యూ  తీసుకొస్తున్న సినిమాను చేసారు. మనందరినీ తల ఎత్తుకునేలా చేసిందీ సినిమా. మనందరినీ గర్వంగా పీలయ్యేలా చేసింది. నిజంగా రాజమౌళికి హ్యాట్సాప్. ఇంకా, అతడిని నమ్మి ఇంత భారీ సినిమా తీసిన నిర్మాతలు, ప్రభాస్, అనుష్క, మిగతా నటీనటులందరికీ హ్యాట్సాఫ్. వీటన్నింటికంటే రాజమౌళితో పాటుగా ఉన్న మొత్తం యూనిట్, అందులోని ప్రతి మనిషీ రాత్రింబవళ్లూ వేరే ధ్యాస లేకుండా పనిచేశారు.
 
అంటూ తెలుగు వారు పలు రంగాల్లో సృష్టించిన గొప్పరికార్డుల వెనుక కష్టం గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వివరించారు. పైగా బాహుబలి అనే పులిని చూసి నక్కల్లాగా వాత పెట్టుకోవద్దని కూడా హెచ్చరించారు.