శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 మే 2024 (14:31 IST)

పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆటో ఇస్తానన్న నిర్మాత

Pawan Kalyan
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ వీరాభిమాని, బేబీ నిర్మాత ఎస్.కె.ఎన్. మరో అభిమానికి మంచి గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్ కేఎన్...మెగా హీరోలకు మద్ధతుగా ఉండే ఎవరినైనా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాడు. ఛారిటీ యాక్టివిటీస్ లో ముందుండి మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా జనసేన గెలవాలని కోరుకున్న ఓ మహిళకు ఆటో బహుమతిగా ఇస్తానని సోషల్ మీడియా ద్వారా మాటిచ్చాడు.
 
పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఓ మహిళ సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది. ఆ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ కు స్పందించిన ఎస్ కేఎన్..ఆ మహిళా అభిమాని కోరుకున్నట్లే జనసేన గెలిచాక ఆమెకు ఆటో కొనిస్తానని చెప్పాడు. ఈ ట్వీట్ కు డైరెక్టర్ మారుతి సహా పలువురు స్పందిస్తూ ఎస్ కేఎన్ ది గోల్డెన్ హార్ట్ అంటూ ప్రశంసిస్తున్నారు.