'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడంటే.. సీక్రెట్ వెల్లడించిన బిజ్జలదేవుడు నాజర్
ప్రచంపవ్యాప్తంగా 'బాహుబలి' చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. 'బాహుబలి ది బిగినింగ్' విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదేఅంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ప్రచంపవ్యాప్తంగా 'బాహుబలి' చిత్రంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. 'బాహుబలి ది బిగినింగ్' విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదేఅంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ సీక్రెట్‌ను దర్శకుడు రాజమౌళితో పాటు ఇతర నటీనటులు కూడా ఎక్కడ కూడా పెదవి విప్పలేదు.
ఈ నేపథ్యంలో ఐఫా (ఇంటర్నేషన్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ వేడుకలో బాహుబలి ఫేమ్ బిజ్జలదేవుడు(నాజర్) సందడి చేశారు. ప్రస్తుతం భాషలతో నిమిత్తం లేదని, మంచి సినిమా చేస్తే ప్రపంచం ఆదరిస్తుందనేందుకు బాహుబలి చిత్రం ఓ చక్కటి నిదర్శనమన్నారు.
అయితే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారని ప్రశ్నించగా, 'ప్రొడ్యూసర్ డబ్బులిచ్చారు.. డైరెక్టర్ చంపమన్నారు.. అందుకే కట్టప్ప బాహుబలిని చంపేశారు' అని చమత్కరించారు. ఇదే సమయంలో బాహుబలి-2లో బిజ్జలదేవుడు స్థంభాన్ని పగలగొడతాడు.. ఆ సీన్‌కు కారణమేంటని ప్రశ్నించగా.. అది రహస్యమని, వెండితెరపైనే చూడాలని ఉచిత సలహా ఇచ్చాడు.