శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:05 IST)

హ్యాట్రిక్ కోసం ఆరాటపడుతున్న బాలయ్య, బోయపాటి..

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాలయ్య కెరీర్లో అతిపెద్ద హిట్‌లుగా నిలిచాయి. అయితే ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు.


గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత సినిమా చేద్దామనుకున్నా, బాలయ్య ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల, అదే విధంగా బోయపాటి కూడా జయ జానకి నాయక, వినయ విధేయ రామ సినిమాలతో బిజీ అయ్యారు.
 
అయితే ఎట్టకేలకు వీరి కాంబోలో రానున్న మూడవ చిత్రానికి ముహూర్తం కుదిరింది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సినిమాని ప్రారంభించనున్నారు. ఎన్‌బికె ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై, బాలకృష్ణ నిర్మాణంలో, ప్రొడక్షన్ నెంబర్-3గా తెరకెక్కబోతుందీ సినిమా. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది.
 
ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల ఫలితాలతో నిరాశలో ఉన్న బాలయ్యకీ, అలాగే వినయ విధేయ రామ వంటి డిజాస్టర్‌తో డీలాపడ్డ బోయపాటికి ఈ సినిమా విజయం కీలకంగా మారనుంది.