శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (13:14 IST)

బాలయ్య బర్త్ డే.. ఫ్యామిలీ సర్‌ప్రైజ్.. పోర్చుగీసుకు వచ్చారు.. బెంట్లీ కారు తాళాలిచ్చారు..

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత బాలకృష్ణ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం బాలయ్య తన 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏడాది తన అభిమానుల మధ్

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత బాలకృష్ణ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం బాలయ్య తన 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏడాది తన అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునే బాలయ్య ఈసారి మాత్రం అభిమానులకు దూరంగా పోర్చుగల్‌లో తన పుట్టినరోజును జరుపుకోవలసి వచ్చింది.
 
ప్రస్తుతం బాలకృష్ణ పూరి దర్శకత్వం వహిస్తున్న 'పైసా వసూల్' సినిమా షూటింగ్ కోసం పోర్చుగల్‌ వెళ్లారు. కానీ బాలయ్యకు పోర్చుగల్‌లో ఆయన కుటుంబీకులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బాలయ్య ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్వి బాలకృష్ణకు అనుకోని సర్పైజ్ ఇచ్చారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అత్యంత ఖరీదైన బెంట్లీ కారును బహుమతిగా ఆయన కుమార్తెలు ఇవ్వడం ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది.
 
దాదాపు కోటిన్నర పైగా విలువచేసే ఈ విలాసవంతమైన కారులో అన్నిరకాల లేటెస్ట్ టెక్నాలజీతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు కూడ ఉంటాయి. బాలయ్యకు పుట్టినరోజు సందర్భంగా ఈ కారుకు సంబంధించిన తాళాలను బాలయ్య కుమార్తెలు ఆయనకు అందించి షాక్ ఇచ్చారు. ఇంకా సోషల్ మీడియాకు దూరంగా ఉండే బాలకృష్ణ కూడ తన పద్ధతి మార్చుకుని తన పుట్టినరోజునాడు ఫేస్ బుక్ లైవ్ చాటింగ్‌లోకి రావడంతో బాలయ్య కూడ యంగ్ హీరోలతో పోటీ పడుతూ మారిపోయారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
అలాగే బాలకృష్ణ పూరిజగన్నాథ్‌‍ల కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీకి ఎవరూ ఊహించని టైటిల్ పెట్టి బాలయ్య అభిమానుల మైండ్ బ్లాంక్ చేసాడు పూరిజగన్నాథ్. బాలకృష్ణ 57వ జన్మ దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈమూవీ టైటిల్ ప్రకటించడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పూరీ జగన్నాథ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.